
రణం న్యూస్ మేడిపల్లి: సెప్టెంబర్19
సంవత్సరానికి రెండు పర్యాలు రైతులు వరి ధాన్యాన్ని పండిస్తారు. పండించిన వరి ధాన్యాన్ని గ్రామాలలో పిఎసిఎస్ కేంద్రాల ద్వారా, మహిళా సంఘాల ద్వారా వరి ధాన్యాన్ని విక్రయిస్తుంటారు. వరి ధాన్యం కేంద్రాలలో విక్రయించే సమయంలో తూర్పార పట్టడానికి రైతులు యంత్రాలను వినియోగిస్తుంటారు. యంత్రాల ద్వారా వరి ధాన్యంలో ఉండే తప్ప, పొల్లు, మట్టి గడ్డలు అన్ని తొలగించి విక్రయించడం ద్వారా వరి ధాన్యానికి రైతుకు ఏ గ్రేడ్ ప్రభుత్వం నిర్ణయించిన ధర వస్తుంది. కొన్ని గ్రామాలలో మహిళా సంఘాల ద్వారా లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వరి ధాన్యం క్లీనింగ్ మిషన్లు ఆరు బయట వదిలివేయడం, ఈ యంత్రాలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పడుతున్నాయి. ఈ విధంగా మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసినటువంటి యంత్రాలు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో దర్శనమిస్తున్నాయి. తుప్పు పట్టడం ద్వారా గ్రామ సమైక్య సంఘం లక్షల్లో నష్టపోతుంది ఇప్పటికైనా సిర్ఫ్ అధికారులు గ్రామాలలో పర్యటించి యంత్రాలను భద్రమైన చోట ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.


