దర్జాగా వచ్చి దాడులు చేయాల్సిన అధికారులు దోబూచులాట…
రహస్య తనికీలలో ఆంతర్యం ఏంటో…
పారదర్శకత లేని తనికీలు…
వారంలో రెండుసార్లు కోరుట్ల కథలపూర్ మండలంలో రైస్ మిల్లులపై దాడులు..
ఒకసారి ఒక మిల్లర్ కు చెందిన పలు మిల్లులు పై…
రెండోసారి మూడు మిల్లులపై దాడులు..
కొందరు మిల్లర్ల పై కక్ష సాధింపు….
రణం న్యూస్ కోరుట్ల: నవంబర్16
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పలు మిల్లులపై దాడులు చేస్తూ అక్రమాలకు పాల్పడిన పలు మిల్లులపై కేసులు నమోదు చేస్తున్నారు.కానీ జగిత్యాల జిల్లా కోరుట్ల డివిజన్ కు వచ్చేసరికి ఆ అధికారులు కూడా అవినీతి ఆరోపణలు ఉన్న మిల్లర్లకు సమాచారం ముందే ఇచ్చి తూ తూ మంత్రంగా తనికీలు చేస్తున్నారని,తనికీలు పారదర్శకంగా జరగట్లేదని, కోట్లలో బకాయిలు ఉన్న మిల్లరపై సవతిప్రేమ చూపెడుతూ..కొందరు మిల్లర్ల పై కక్ష సాధింపుకు దిగుతున్నారని ఆరోపణలు బహిర్గతంగానే చేస్తున్నారు.ఈ కోవలోనే వారంలో రెండు సార్లు కథలపూర్ కోరుట్ల మండలాల్లోని రైస్ మిల్లులపై అధికారులు సీక్రెట్ గా దాడులు చేయడం కూడా లోపాయకార ఒప్పందం కుదుర్చుకున్నారని అనడం లో నిజంలేకపోలేదు…

కోట్ల రూపాయల ధాన్యం కొల్లగొట్టారంటూ ఆరోపణలున్న ఒక మిల్లర్ మాఫియాకు గతంలో జిల్లా నాయకుడు గా పనిచేసిన నాయకుడి కి చెందిన కథలపూర్ మండలం సిరికొండ గ్రామంలోని మిల్లులపై కోరుట్ల లో రైస్ మిల్లు ల పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీక్రెట్ గా దాడులు నిర్వహించడానికి గల కారణాలు తెలియరావడం లేదు. కోట్ల రూపాయల విలువైన ధాన్యం పందికొక్కులా మెక్కిన యజమాని కుమ్మక్కు అయ్యారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.మిల్లర్లకు అధికారులకు మధ్యవర్తులు గా తాజాగా మిల్లర్లు గా అవతారమెత్తిన చోటా మోటా ఖద్దరు వ్యాపారస్తులు వ్యవహరిస్తున్నట్లు చర్చిస్తున్నారు.ఐదారు వాహనాల్లో వచ్చి గుట్టు చప్పుడు కాకుండా తనికీలు చేసి జిల్లా అధికారికి కూడా తనికీకి సంబంధించి రిపోర్ట్ ఇవ్వలేదని అనడం..ఈ బియ్యం బుక్కిన దొంగల్లో అందరూ పాత్రదారులేనా అనే అనుమానాలు నిజమే అనే అవకాశాలు కూడా బలపడుతున్నాయి.

