రణం న్యూస్ కోరుట్ల,జూన్2

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో జరుగుతున్న 39వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్-జూనియర్ తైక్వాండో చాంపియన్షిప్ – 25 పోటీలలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన యువకుడు ఎం.డి ఖాజా సుబహుద్దీన్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా బంగారు పతకం సాధించి తన ప్రతిభను చాటుకున్నారు.ఈ సందర్బంగా ప్రముఖులు ప్రశంసిస్తూ మరిన్ని పథకాలు సాధించాలని అభినందించారు.