రణం న్యూస్ కోరుట్ల, జూన్ 19:


బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన టిడబ్ల్యూజేఎఫ్ మహాసభలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన కోరుట్ల పట్టణానికి చెందిన నేటి ఉదయం తెలుగు డిజిటల్ దినపత్రిక ఎడిటర్ బలిజ రాజరెడ్డిని పలువురు ప్రజా ప్రతినిధులు విశ్రాంతి ఉద్యోగులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నంత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉయ్యాల నరసయ్య ,వన తలుపుల మురళి, ప్రకాష్, ఉయ్యాల శోభన్ ,సామల వేణుగోపాల్, బద్ది మురళి, కల్లూరి దేవయ్య, పొట్ట లక్ష్మణ్, గురు మంతుల సత్తయ్య, గాడేల రాజు తదితరులు పాల్గొన్నారు.