పేదలకు అండగా ఉంటాం…జువ్వాడి నర్సింగరావు.

ప్రజాసేవలో ముందుంటాం.. కేమాన్గ్స్ అధ్యక్షురాలు స్వీటీఅనుప్ రావ్…
రణం: న్యూస్ కోరుట్ల: ఏప్రిల్7, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కోరుట్ల పట్టణ కింగ్స్ గార్డెన్లో కోరుట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఇట్టి వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు విచ్చేశారు ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కోరుట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జమాతే ఇస్లామి హిందూ గైనకాలజీ ఆధ్వర్యంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు ఇలాంటి వైద్య శిబిరాలు మునుముందు మరెన్నో నిర్వహించాలని కోరారు ఎలాంటి అవసరం ఉన్నా తాను అన్ని విధాలా అండగా ఉంటానన్నారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రతి పేదవాడికి అందజేస్తున్నామని ఇప్పటివరకు కోరుట్ల నియోజకవర్గంలో రెండు కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తో పాటు ఐఎంఏ ఇట్టి వైద్య శిబిరంలో కెమాంగ్స్ అధ్యక్షురాలు డాక్టర్ స్వీటీ అనుప్ రావు ఐఎంఏ వైద్యులు అనుప్ రావు రేగొండ రాజేష్ డజోష్ణ శృతి అనురాధ జగదీశ్వర్ దీప్తి అవినాష్ వేణుగోపాల్ మధుశ్రీ వోడ్నాల నరేష్ ముక్క ఇంద్రనీల్ గీత ఇంద్రనీల్ అనురాగ్ మహదేవ్ రమేష్ గండ్ర కేశవ అన్వేష్ మనోహర్ సోమేష్ కోరుట్ల పట్టణానికి చెందిన వైద్యులు మాజీ కౌన్సిలర్లు స్థానిక నాయకులు జమాతే ఇస్లామీ హిందూ ఉమెన్స్ వింగ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు