అయోమయంలో బీమారం మండల రైతులు.
రణం న్యూస్, భీమారం మండలం, జూన్ 20:

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం నుండి భీమారం మండలం గా ఏర్పడి సుమారు రెండు సంవత్సరాల కాలం దాటింది. ఇప్పటివరకు భీమారం మండల కేంద్రానికి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయబడలేదు. అందులో భాగంగా వ్యవసాయ కార్యాలయం ఒకటి. ప్రస్తుతం రైతులకు ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రైతుల ఖాతాలో రైతు భరోసా రూపాయలు జమ చేస్తున్నట్లు ప్రకటనలు ఇస్తోంది. కానీ కొంతమంది రైతులు వారి ఖాతాలో ఇప్పటివరకు రైతు భరోసా జమ కాలేదని చెబుతున్నారు. ఈ విషయం గురించి ఏ మండలానికి సంబంధించిన ఏ అధికారిని అధికారిని సంప్రదించాలని, మా అధికారి ఎవరు అని రైతులు సతమత పడుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి మేడిపల్లి మండలం వ్యవసాయ ఉద్యోగిని ఒకరిని సంప్రదించగా భీమారం మండలానికి వ్యవసాయ అధికారి ఉన్నారు వారిని సంప్రదించండి అని సమాధానం ఇస్తున్నారు. అదేవిధంగా ఫోన్లో సంప్రదించగా స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం భీమారం మండలానికి వ్యవసాయ అధికారి కార్యాలయం ఏర్పాటు చేసి అధికారిని నియమించాలని రైతులు కోరుతున్నారు.