రణం న్యూస్ మద్నూర్,జులై5
కామారెడ్డి జిల్లాలో ప్రఖ్యాతగాంచిన మద్నూర్ మార్కెట్ కమిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.69 లక్షల నిధులు మంజూరు చేసింది. మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందుకు మార్కెట్ కమిటీ పాలకవర్గం మంగళవారం కార్యాలయావరణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు కలిసి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు…ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ అభివృద్ధికి రూ.69 లక్షల నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి కి జుక్కల్ ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మంజూరైన నిధులతో మార్కెట్ కమిటీ అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఈ పాలాభిషేక కార్యక్రమంలో సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సీనియర్ నాయకులైన హనుమాన్లు స్వామి, విట్టల్ గురూజీ, కొండ గంగాధర్, నాయకులు సంతోష్ మేస్త్రి ,దిగంబర్, ఈరన్న ,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
