
అత్యవసర సమయంలో రక్తదానం
రణం న్యూస్ కోరుట్ల, మే 9: ఓ అబలకు అత్యవసరంగా రక్తదానం చేసి ప్రాణభిక్ష పెట్టి జగిత్యాల జిల్లా మన్నెగూడెం విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ ఎక్కల్ దేవి హరిప్రసాద్ మానవత్వాన్ని చాటుకున్నారు. రక్తదాత సబ్ ఇంజనీర్ ఎక్కల్ దేవి హరిప్రసాద్ వైద్యులు, ఉద్యోగులు, రోగి బంధువులు, మిత్రులు అభినందించారు. వివరాల్లోకి వెళితే కోరుట్ల పట్టణంలోని *రేని ఎమర్జెన్సీ & క్రిటికల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన రాజుబాయి అనే మహిళకు అత్యవసరంగా ఓ నెగటివ్ రక్తం అవసరం అని వైద్యులు చెప్పడంతో అరుదుగా దొరికే ఓ నెగటివ్ రక్తాన్ని కుటుంబ సభ్యులు రక్తదాత కోసం వెతుకుతూ ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సుర్గి శ్రీనివాస్ రక్తదాత అనుసంధాన కర్త ఉదయ్ కుమార్ ను సంప్రదించగా మన్నెగూడెం విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ ఎక్కల్ దేవి హరిప్రసాద్ ను సంప్రదించారు. స్పందించిన సబ్ ఇంజనీర్ ఎక్కల్ దేవి హరిప్రసాద్ మెట్ పల్లిలోని బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తదానం చేశారు. కుటుంబ సభ్యులతో ఫంక్షన్ కి వెళ్ళవలసి ఉండగా రక్తం అవసరం సమాచారం ఫోన్ చేయగానే వెంటనే బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి మన్నెగూడెం సబ్ ఇంజనీర్ ఎక్కల్ దేవి హరిప్రసాద్ రక్తదానం చేశారు. సొంతింటి వాళ్ళకే ఆపదలో ఆడుకునేందుకు ఆలోచించే ఈ రోజుల్లో ఒక్కక్షణం ఆలోచించ కుండా అరుదుగా దొరికే *ఓ నెగటివ్ రక్తం* అవసరం అని చెప్పగానే వెంటనే స్పందించి కుటుంబ సభ్యులతో బ్లడ్ బ్యాంక్ కి వచ్చి రక్తదానం చేసిన మన్నెగూడెం విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ ఎక్కల్ దేవి హరిప్రసాద్ ను బ్లడ్ బ్యాంక్ డాక్టర్ రాజనీకర్ రెడ్డి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ – సుర్గి శ్రీనివాస్,రక్తదాతఅనుసంధాన కర్త ఉదయ్ కుమార్, విద్యుత్ ఉద్యోగులు, రోగి బంధువులు, స్నేహితులు అభినందించారు.