
అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత
రణం న్యూస్ , జగిత్యాల,మే 8: స్థానిక సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ తో కలిసి 2023 నుండి 2025వ సంవత్సరాలలో జరిగిన మాతృ మరణాలపై వైద్యాధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ మాతృ మరణాల రేటును తగ్గించవలెనని ,గర్భవతిగా నమోదు చేసినప్పటి నుండి క్రమం తప్పకుండా ఆంటీనేటల్ చెకప్ లు చేయించవలెననీ, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్నట్లయితే జాగ్రత్తగా వారిని గైనకాలజిస్ట్ కు చూపించవలెనని తెలిపారు. జిల్లా మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా మాతృ మరణాల నివేదికను సమర్పించారు. అనంతరం వైద్యాధికారు లు వారి యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో జరిగినటువంటి మాతృ మరణాల నివేదికను సమర్పించగా కమిటీలోని సభ్యులంతా మాతృ మరణాలు జరగకుండా తప్పించి మార్గాలను అన్వేషించాలని సూచించారు. గర్భిణీగా నమోదైనప్పుడే అన్ని రకాల పరీక్షలతో పాటు 2 D ఎకో,స్కానింగ్ లు చేయించినట్లయితే వారికి వచ్చినటువంటి వ్యాధులను సులభంగా గుర్తించి చికిత్స అందించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సూపర్ ఇంటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎండి సమీయుద్దీన్, డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ,డాక్టర్ ఏ శ్రీనివాస్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పూర్ణచందర్, గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మిని ,డాక్టర్ సాయి సుధా మత్తువైద్య నిపుణులు డాక్టర్ కోట సుధీర్, వైద్యాధికారులు డాక్టర్ సతీష్ డాక్టర్ అంజిత్ రెడ్డి , డాక్టర్ సింధుజ ,హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్ , తరాల శంకర్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి రాజేశం ,సూపర్వైజర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.