స్వచ్చంద సేవకులకు ఉన్న సోయి మున్సిపల్ అధికారులకు లేదాయే..
ఆ నిధులన్నీ మున్సిపల్ అధికారులే మెక్కారా..
ఆ అధికారి అత్యుత్సాహం లక్షల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరుగా మారిన వైనం
రణం న్యూస్ కోరుట్ల: ఫిబ్రవరి 22,
ఒక భక్త సమాజం నేడు అబివృద్ధిని కాంక్షిస్తుంది సమాజ శ్రేయస్సుని కోరుకుంటుంది.తమ భక్తిభావం కాకుండా ప్రకృతి ని కూడా రక్షించే పనిలో పడ్డారు.. సంతు నిరంకారి మిషన్ వారు చేసిన మినీ ట్యాంక్ బండ్ పరిసరాల శుభ్రం కార్యక్రమం పలువురిని ఆలోచింపజేసేలా చేసింది

శ్రీ సద్గురు బాబా హారదేవ్ సింగ్ జి మహరాజ్ జయంతిని పురస్కరించుకుని కోరుట్ల మద్దుల చెరువు దగ్గర నిరంకారి భక్తులు శుభ్రం చేశారు హారదేవ్ సింగ్ జి గారి జీవిత కాలంలో ఇచ్చిన స్ఫూర్తితో నే ఈ కార్యక్రమాన్ని చేశామన్నారు . స్వచ్ఛ జల స్వచ్ఛ మనసు అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది సంఖ్యలో జలాశయాన్ని శుభ్రం చేయటమే తమ లక్ష్యమని అన్నారు. కోరుట్ల శ్రీ సంత్ నిరంకారి మిషన్ బ్రాంచ్ 1257 ఆధ్వర్యంలో ఈ కార్యక్రమన్నీ నిర్వహించారు ఇందులో నిరంకారి సేవదల్ సభ్యులు ముఖి జి పాల్గొన్నారు..వీరి సేవలను పలువురు ప్రశంశించారు.

టెండరు పిలువకుండా లక్షలు స్వాహా చేసిన అధికారగణం… కాంట్రాక్టర్…:-
మున్సిపల్ అధికారులు అభివృద్ధి పేరిట వచ్చిన నిధులు ఆమ్ బుక్క చేశారని పలువురు బహిరంగ విమర్శలు చేస్తున్నారు.అభివృద్ధి పేరిట వచ్చిన లక్షల రూపాయల నిధులను పందికొక్కుల్లా మెక్కుతున్న అధికారులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్లే అనిపిస్తుంది టెండరు పిలువకుండా సొంత పనిగా మొదలుపెట్టిన అధికారి తొమ్మిది లక్షల రూపాయలు కాంటాక్ట్ పెట్టి తొలగించిన గుర్రపు డెక్క ఏడాది గడవక ముందే మొత్తం వ్యాపించడం గమనార్హం. ముందు పనులు తర్వాత తనకు ఎక్కువ కమీషన్ లు ఇచ్చే కాంట్రాక్ట్ లతో టెండరు కొత్త తరహా నిబంధనలు పెట్టిన స్పెషల్ అధికారి తీరు ఇలాంటి పనులలో దిట్టగా కనిపిస్తుంది.

