ఇద్దరు నిందితుల అరెస్ట్… మెట్ పల్లి సి. ఐ. అనిల్.
రణం న్యూస్ జగిత్యాల, ఆగస్టు 5, జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం, వేంపల్లి గ్రామంలో భూ వివాదం కారణంగా జరిగిన దారుణ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు మెట్పల్లి సి.ఐ. వి. అనిల్ కుమార్ మంగళవారం రణం ప్రతినిధితో అన్నారు .ఆగస్టు 2, 2025న రాత్రి 7:30 గంటల సమయంలో ఈ హత్య జరిగింది. మల్లాపూర్‌కు చెందిన నానం చిన్న హన్మండ్లు (58) అతని కుమారుడు నానం రాకేశ్ (34) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 15 సంవత్సరాల క్రితం హన్మండ్లు కొనుగోలు చేసిన భూమి పక్కన ఉన్న పాత వ్యవసాయ బావిని పూడ్చి ఆక్రమించుకోవడానికి నిందితులు ప్రయత్నించారు. దీనిని మృతుడు సకినపల్లి కాశీం అడ్డుకోవడంతో వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.ఈ వివాదంపై గతం లో పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినా పరిష్కారం కుదరలేదు. సమస్య పరిష్కారం కాకపోవడంతో నానం హన్మండ్లు, రాకేశ్ కలిసి సకినపల్లి కాశీంను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.మొదట హన్మండ్లు తనతో తెచ్చుకున్న కర్రతో అతని తల, ముఖంపై బలంగా కొట్టాడు. కాశీం రోడ్డుపై పడిపోవడంతో, హన్మండ్లు కుమారుడు రాకేశ్ కూడా తన చేతిలోని కర్రతో ఛాతీపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో కాశీం అక్కడికక్కడే మరణించాడు. హత్య తర్వాత నిందితులు అక్కడి నుంచి వారి మోటార్ సైకిల్ పై పారిపోయారు.
అయితే, నిందితుడు హన్మండ్లు ఊరిలోని ఓ పెద్ద మనిషికి ఫోన్ చేసి తామే హత్య చేసినట్లు చెప్పడంతో కేసు వెలుగులోకి వచ్చింది. మృతుడి పెద్ద కుమారుడు సకినేపల్లి లక్ష్మీనరసయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో గోదూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నిందితులు నేరం అంగీకరించారని సి ఐ అనిల్ తెలిపారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కర్ర, పారిపోవడానికి ఉపయోగించిన మోటార్‌సైకిల్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, అనంతరం వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు

