
బూమాత శాంతించాలని కోరుట్ల మండలం పైడిమడుగులో పూజలు



రణం న్యూస్(కోరుట్ల) మే14
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో మహిళలు భూమాతకు బూరెలను నైవేద్యంగా పెట్టి భూమాత శాంతించాలని పూజలు చేశారు.మొన్న జగిత్యాల లతో పాటు పలు జిల్లాలో భూమి కంపించింది,పూర్వం నుండి ఎప్పుడైన భూమి కంపిస్తే భూమాతకు బూరెలు నైవేద్యంగా సమర్పిస్తే శాంతిస్తుందని నమ్ముతారు,అందుకే కొందరు మహిళలు బూరెలు చేసి గ్రామ శివారులో ఓ చెట్టు వద్ద మట్టి తీశారు,ఆ మట్టిలో ముగ్గు చేసి,పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత బూరెలను పెట్టారు,అనంతరం పూజలు నిర్వహించి మట్టి కప్పారు,ఆ తర్వాత అక్కడికి చేరుకున్న మహిళలు బూరెలు తిని ముగించారు.భూమాతకు బూరెలంటే ఎంతో ఇష్టమట అందుకే వాటిని నైవేద్యంగా సమర్పిస్తే అమ్మ శాంతిస్తుందని చెపుతున్నారు.మరోసారి భూకంపం రావద్దని బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశ్యంతో చేపట్టామని మహిళలు చెపుతున్నారు…