అన్ని రంగాల్లో కోరుట్ల వారు ముందుండాలి… భారతీయ సంఘం


రణం: న్యూస్ కోరుట్ల, ఆగస్టు 24
కోరుట్ల భారతీయ సంఘం ఆద్వర్యం లో ప్రముఖులను ఘనంగా సన్మానించారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి గా నియమితులైన పట్టణానికి చెందిన ఆకుల మల్లికార్జున్ ను, జాతీయ ఖో ఖో క్రీడా కారుడు క్రీడా రంగం లో డాక్టరేట్ పొందిన నవీన్ ను ఘనంగా సన్మానించారు.పట్టణానికి చెందిన వారు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయం ఉపాధ్యక్షులు సంకు అంబరీష్, లుక్క విరాజ్, ప్రధాన కార్యదర్శి ఎంబేరి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి ఎంబేరి ఆనంద్, కోశాధికారి ఎక్కల్ దేవి గోపాల్, సహాయ కోశాధికారి నడిమట్ల రాజేశం, సాంస్కృతిక కార్యదర్శి పిట్ట మధు,సలహాదారులు ఎంబేరి అమర్ నాథ్, మామిడాల మహదేవ్, ఏంబేరి రంజిత్, పిట్ట వెంకటేష్,వాసం నవీన్, సిరిపురం ప్రతీప్, ఎంబేరి రవీందర్, నల్ల రాజు, ఏంబేరి ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.

