
రణం ప్రతినిధి, మెట్ పల్లి, జూలై 6..
ఇటీవల భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన పట్టణానికి చెందిన రాచకొండ యాదగిరి బాబు ను మున్నూరు కాపు దుబ్బవాడ సంఘం సభ్యులు ఆదివారం ఘనంగా సన్మానించారు. మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు సంఘ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తోట ప్రసాద్, దోనికేల నవీన్, దోమకొండ రమేష్, ఆగ సురేష్, ఉసికేల లక్ష్మణ్, తోట శివకుమార్, జైపాల్, జంగిటి గంగాధర్, గోల్కొండ నాగరాజు, గుర్రాల రాజేష్, నునుగొండా చంద్రమోహన్, దికొండా చంద్రశేఖర్, దుమ్మటీ శంకర్, షేర్ వేణు, రామ్ రెడ్డి, శివన్నోళ్ళ రాజు, గుర్రాల కిషన్, శిల్ప నవీన్, వేణు, తదితరులు పాల్గొన్నారు.