రణం: న్యూస్ కోరుట్ల: ఏప్రిల్ 5,దేశ మాజీ ఉప ప్రదాని, సమత వాది పుజ్య డా. బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల పక్షన నిలబడి వారి అభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన మహానేత పెరిట కోరుట్లలో నిర్మించనున్న మిని పంక్షన్ హాల్ కు ఐదు లక్షల నిధుల ప్రకటించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ్ రావుకు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.
శనివారం కోరుట్లలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జరిగిన జయంతి ఉత్సవాలలో జగ్జీవన్ రామ్ విగ్రహనికి ఘనంగా పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ భారత దేశ ఔన్నత్యాన్ని దశదిశలా విస్తరించి కార్మిక రంగంలో అనేక సంస్కరణలకు అద్యుడుగా నిలిచి ఎనలేని సేవలు చేసిన మహానీయుడి బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన పెరిట నిర్మించనున్న పంక్షన్ హాల్‌కు ఐదు లక్షలు ఇవ్వనున్నట్లు వెంటనే టెండర్లు పిలుస్తామన్నారు. దేశ అత్యున్నత భారత రత్న అవార్డు ఇచ్చి బాబు జగ్జీవన్ రామ్ ను గౌరవించలాని పేట భాస్కర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కోరుట్ల ఆర్డీవో జివాకర్, మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్ లు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకై అందరం పని చేయాలన్నారు. ఈకార్యక్రమంలో బిసి సంఘాల రాష్ట్ర ఉపాద్యక్షులు రుద్ర శ్రీనివాస్ మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం వేణు, కాంగ్రెస్, బిజెపి పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్, బింగి వెంకటేష్ మాజీ కౌన్సులర్లు మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, బలిజ రాజరెడ్డి,ఎంబెరి నాగభూషణం,అడేపు మధు, పుప్పాల ప్రభాకర్, సంగ లింగం రఫీ,నయిమ్,మాడవేణి నరేష్, కస్తూరి లక్ష్మీ నారాయణ,మచ్చ కవిత, సొగ్రాబి,సుజాత దళిత సంఘాల నాయకులు వుయ్యాల నర్సయ్య, చిట్యాల లచ్చయ్య, చెట్పల్లి లక్ష్మణ్,పసుల కృష్ణ ప్రసాద్, బెక్కెం అశోక్ మాదిగ కుల సంఘ అధ్యక్షులు శనిగారపు రాజేష్, ఉపాద్యక్షులు ఎస్ మహేష్, కార్యదర్శి మోర్తాడ్ రాజశేఖర్, చిట్యాల ప్రభాకర్, అశోక్, సామల్ల దశరథం,బలవంతుల గంగానర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

