బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించిన జువ్వాడి నర్సింగరావు
రణం: న్యూస్ కోరుట్ల: ఏప్రిల్5:బాబు జగ్జీవన్ రావ్ 117వ జయంతి సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అనంతరం ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్ లోని చంద్వా గ్రామంలో జన్మించారు భారతదేశ నాలుగవ ఉప ప్రధానిగా పని చేశారు అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెషనల్ క్లాసెస్ అనే సంస్థను స్థాపించి కీలకపాత్ర పోషించారు దేశ హరిత విప్లవం విజయవంతంలో కీలకపాత్ర పోషించారు భారత రాజ్యాంగంలో ప్రతిష్టాత్మకమైన సామాజిక న్యాయ సూత్రాల ప్రాముఖ్యతపై అధిక ప్రాధాన్యత ఇచ్చిన కొద్ది మందిలో బాబు జగ్జీవన్ రామ్ ఒకరని వారి సేవలను కొనియాడారు ఈకార్యక్రమంలో ఆర్డీవో జివాకర్ రెడ్డి కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
