
రణం :న్యూస్ కోరుట్ల: మార్చి26,కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అల్లె మారుతి ప్రసాద్ ను కాంగ్రెస్ నాయకులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొమ్మిదవ వార్డ్ ఇంచార్జ్ వీరబత్తిని దశరథం, పట్టణ సహాయ కార్యదర్శులు ఎంబేరి సత్యనారాయణ, చిట్టి మిల్లి రంజిత్ కుమార్ గుప్తా, చిలివేరి విజయ్ తదితరులు పాల్గొన్నారు.