దొంగ సర్టిఫికెట్ లు పొందినవారి పై చర్యలుంటాయా… ఉండవా….
లంచం తీసుకున్నవాడిని..ఇచ్చేవాడిని ఇద్దరిని నేరస్థులుగా పరిగణించినపుడు..
ఆ నకిలీ పత్రాలు పొందిన 106 మంది పై కూడా చర్యలు తీసుకొనున్నారా…లేదా…?
పంతొమ్మిది వందల తొంభై కాలం లోనే నకిలీ బీఈడీ సర్టిఫికెట్ లకు కేంద్ర బిందువుగా కోరుట్ల
రణం: న్యూస్ కోరుట్ల: జులై 23,
నకిలీ సర్టిఫికేట్ల తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల జిల్లా కోరుట్ల సీఐ సురేష్ బాబు తెలిపారు. బుధవారం కోరుట్ల పోలీస్ స్టేషన్ నుండి విలేకరులకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఆయన తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల పట్టణంలోని పోచమ్మవాడలో మంత్ర ఆన్లైన్ సెంటర్ నిర్వహకుడు రుద్ర వేణుగోపాల్ అనే వ్యక్తి సకిలీ సర్టిఫికేట్ల తయారు చేస్తున్నాడని సమాచారం రాగా సిసిఎస్ పోలీసులు ఆన్లైన్ సెంటర్ పై ఆకస్మిక దాడి చేసి 106 నకిలీ సర్టిఫికేట్లు, ఒక కంప్యూటర్, ఒక ప్రింటర్, ఒక లామినేషన్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడైన రుద్ర వేణుగోపాల్ నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి అవసరమున్న వారికి విక్రయించి డబ్బులు సంపాదించే వాడని, అతని వద్ద నుండి నకిలీ ఎస్సెసీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్ సర్టిఫికేట్లు, నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు స్వాధీనం చేసుకున్నామని సిఐ తెలిపారు. నిందితుడు విక్రయించిన ఫేక్ సర్టిఫికెట్ ల వివరాలను సేకరించడంలో, నిందితుడుని పట్టుకోవడంలో కృషి చేసిన కోరుట్ల సీఐ సురేష్ బాబు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాస్, ఎస్ఐలు చిరంజీవి, కె. రాజు, కానిస్టేబుళ్లు అఫ్రోజ్, సాజిద్, వినోద్, కమలాకర్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నకిలీ బీఈడీ సర్టిఫికెట్ హబ్ గా కోరుట్ల:-
గతం లో 1990 దశకంలో దొంగ బీఈడీ సర్టిఫికెట్ కుంభకోణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కోరుట్ల పేరు పెద్ద సంచలనం అయింది. మళ్ళీ ఇపుడు ఈ నకిలీ సర్టిఫికెట్ ల వ్యవహారం పెనుదుమారం లేపుతుంది. ఈ ఫేక్ పత్రాలు పొందిన వారు,ఇంకా కొన్ని రకాల విధులు కూడా నిర్వర్తిస్తున్నట్లు కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి.వారి వివరాలు కూడా సేకరించి తదుపరి చర్యలకు విచారణ అధికారులు సిద్దమవుతున్నారా..? పాత్రధారి పై చర్యలు తీసుకుని పాత్ర దారులను వదిలేస్తారా వేచి చుద్దాం..
ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసినవారూ నిండుతుడు అయితే… తీసుకున్నవారు నిందితులే కదా...
వివిధ రకాల అర్హత విద్యాపత్రాలు విక్రయించిన్నవాడు మాత్రమే నేరస్థుడా.. పొందినవారు ఇందులో బాగస్వామ్యులు కారా.. లంచం తీసుకునేవారు నేరస్థులే ఇచ్చేవారు నేరస్థులే అని చట్టంలో ఉన్నపుడు…సర్టిఫికెట్ లు తయారు చేసినవాడు… అవి వారి నుండి పొందినవారు కూడా నెరస్థులే ఆవతారు కదా.. వారి పై చర్యలు ఉన్నాయా.. లేవా…ఉంటే అవి ఏంటి… అనే కోణం లో మేధావులు కొంచెం ఆలోచిస్తే మీకే అసలు విషయం తట్టుతుంది.