ఫార్మసీ సేవలు వెలకట్టలేనివి
రణం న్యూస్ కోరుట్ల మే19,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఫార్మసిస్టులను ఫార్మసీ ఆఫీసర్స్ గా పేరు మార్చిన సందర్భంగా కోరుట్ల ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫార్మసీ ఆఫీసర్ ఉదయ ప్రసాద్ ను సన్మానించిన సూపరింటెండెంట్ డా” సునీత రాణి అలాగే మిగతా సిబ్బంది చిరంజీవి, అనురాధ, ప్రవళిక ఫార్మసీ ఆఫీసర్లను సన్మానించి కేక్ కట్ చేసి ఫార్మసీ ఆఫీసర్లకు ఆస్పత్రి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ సునీత రాణి, డాక్టర్ లక్ష్మి ఆర్ ఎం ఓ డా వినోద్, డా రమేష్,,డా శిల్పా డా గంగాధర్, నర్సింగ్ సూపరిండెంట్స్, నర్సింగ్ స్టాఫ్, వివిధ క్యాడర్ల హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


