విధుల్లో చేరక ముందే తాజా మాజీ ప్రజాప్రతినిధులకు…
ముడుపులు పంపే చీకటి వ్యాపారులకు ఫోన్ లు?
కోరుట్ల లో చర్చానీయాంశంగా మారిన విధుల్లో చేరబోయే అధికారి చిట్ చాట్ లు
రణం న్యూస్ కోరుట్ల, జూన్ 28
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి కొత్తగా నూతన అధికారిగా బాధ్యతలు తీసుకోవడానికి పక్కజిల్లా నుండి గతం లో ఇదే నియోజకవర్గంలో విధులు నిర్వహించిన సదరు అధికారి తాజామాజి కౌన్సిలర్లకు.. తాజా మాజీ సర్పంచులకు ..ఎంపిటిసి లకు.. ప్రజాప్రతినిధులకు… రియలటర్లకు…ఇసుక మాఫియాకు… మట్టి… లిక్కర్… పేకాట… మిల్లర్ల కు…తదితర ఆదాయ వనరులు వచ్చే అన్ని వ్యవస్థలకు చరవాని ద్వారా సంభాషణలు సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం కోరుట్ల పట్టణంలో మండలంలో దావాణానం ల వ్యాపిస్తోంది.. ఈ విషయం తెలిసిన కొందరు ఇంతకీ ఆ అధికారి ఎవరు…? ఆయన ఉద్దేశ్యం ఏంటి? ఉద్యోగధర్మాన్ని పాటిస్తాడా… లేక కాసులకోసమేనా ఉద్యోగమా అని ముక్కున వేలేసుకుని బహిరంగ విమర్శచేస్తున్నారు.. ఏది ఏమైనా కోరుట్ల ప్రజలు చాలా మంచివారు..ఆ మంచితనాన్ని ఆసరా చేసుకుని కొందరు వంచిస్తున్నారనే అపవాదులు లేకపోలేదు.. గతప్రబుత్వం లో వారే ఈ ప్రభుత్వంలో వారిదే అందే వేసిన చేయి..