రణం న్యూస్, మేడిపల్లి మండలం ,జులై 29:

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న దిండిగాల మురళీకృష్ణ మంగళవారం రోజున పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ మురళీకృష్ణ జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఉపాధ్యాయ వృత్తి చేపట్టి అనేక మంది విద్యార్థిని విద్యార్థులను తనదైన శైలిలో తీర్చిదిద్దారని, మురళీకృష్ణ శిష్యులు అనేకమంది వివిధ రంగాలలో ఉన్నారని, మురళీకృష్ణ సేవలు పాఠశాలకు అనేకం ఉన్నాయని, పదవి విరమణ తర్వాత ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా పి ఆర్ టి యు టి ఎస్ బోయినపల్లి ఆనందరావు, మేడిపల్లి మండల ఎంఈఓ లక్ష్మీ నరసయ్య, భీమారం ఎంఈఓ మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సురేష్, పాఠశాల హెచ్ఎం లలిత, ఉపాధ్యాయులు పెద్దిరాజు, శంకర్ ,భాస్కర్, రమేష్ , గోరవీందర్, సత్యం రెడ్డి గౌతమ్, గంగాధర్, రవీందర్ ఉపాధ్యాయ బృందం, వివిధ పాఠశాల ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.