ఎం ఐ ఎం కోరుట్ల పట్టన అధ్యక్షుడు ఎం.ఎ.రఫీ
రణం న్యూస్ కోరుట్ల,జూన్19
కోరుట్ల పట్టణములో ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర కేసులు వస్తే పట్టుకోకుండా, జగిత్యాలకు తరలిస్తున్నారని. దీని వలన రోగులు,క్షతగాత్రులు చికిత్స అందక మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని , ఎమర్జెన్సీ సమయం లో వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని,పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి దిక్కు అని ఎం ఐ ఎం కోరుట్ల పట్టణ అధ్యక్షుడు రఫీ విమర్శించారు.వైద్యుల కొరత వసతులు మెరుగు పరచాలని హాస్పిటల్ సూపరెండేంట్ సునీత కు వినతిపత్రం సమర్పించారు.అనంతరం రెవెన్యూ డిజనల్ అధికారి కార్యాలయం లో కూడా వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎం ఐ ఎం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ వాజిద్ ,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

