
పంచాయితీ, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క
రణం న్యూస్ జగిత్యాల మే10
తెలంగాణలో కొలువు దీరిన
ప్రజా ప్రభుత్వంలో పంచాయితీ కార్యదర్శుల పాత్ర కీలకమని పంచాయితీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు.శనివారం జరిగిన పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనo హైదరాబాద్ లో పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన జరుగగా రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జరుగాలన్నా పంచాయతీ కార్యదర్శుల బాధ్యతేనని చెప్పారు.పల్లెల్లోపచ్చధనం, పరిశుభ్రతను కాపాడడమే కాకుండా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని సీతక్క వ్యాఖ్యనించారు.
కార్యదర్శుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయన్నాయంటే కార్యదర్శుల వళ్లేనని స్పష్టం చేశారు.స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పల్లెలన్నీ స్వచ్ఛంగా ఉంచుతూ దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులను తీసుకొస్తునారని ఇది పంచాయతీ కార్యదర్శుల వల్లనే సాధ్యమైందన్నారు.కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఓ పి ఎస్ నుండి జే పి ఎస్ గా మార్చి కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. గ్రేడ్-4 కార్యదర్శుల 4ఏళ్ల ప్రోహిబిషన్ కాలాన్ని సర్వీస్ లోకి తీసుకోవాలని సూచించారు.మెడికల్, పి ఎఫ్ సౌకర్యం కల్పించాలని శ్రీకాంత్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.అనంతరం జగిత్యాల జిల్లా పంచాయితీ కార్యదర్శులు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ లనుఘనంగాసన్మానించారు.కార్యక్రమం లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రో. కోదండరాం,జగిత్యాల జిల్లా పంచాయతీ కార్యదర్శిల సంఘం అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ,కోశాధికారి సిద్ధం సతీష్ కుమార్, నునావత్ రాజ్, హరీష్ కుమార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.