రోడ్డెక్కిన అగ్రికల్చర్ విద్యార్థులు..
రణం: న్యూస్ కోరుట్ల:,ఫిబ్రవరి 26
రాష్ట్రంలో అన్ని బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలలో ఉన్న విధంగా తమ కళాశాలలో ఫ్యాకల్టీ వసతులు కల్పించాలని
కోరుట్ల పట్టణంలోని అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థినిలు వేములవాడ ప్రధాన రోడ్డు పై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నలుగురు అధ్యాపకులతో ఎలాంటి వసతులు లేని భవనంలో మా కాలేజీని నడిపిస్తున్నారని, నలుగురు అధ్యాపకులతో ఎలాంటి వసతులు లేని భవనంలో కాలేజీనినడిపిస్తున్నారన్నారు.కాబట్టి అన్ని ఫ్యాకల్టీలతో రాష్ట్రంలోని అన్ని కాలేజీలో ఉన్న విధంగా పూర్తి స్థాయీ వసతులు కల్పించాలని, అధ్యాపకులను నియమించాలని కోరారు. విద్యార్థుల ధర్నాతో ట్రాఫిక్ కాసేపు స్ధాబించి పోయింది. దీంతో మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

