
రత్నాకర్ రావు ఆశయసాధనకకు కృషి చేద్దాం
కోరుట్ల నియోజక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ రావు
రణం న్యూస్ కోరుట్ల:మే10
కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు జువ్వాడి శేఖర్ రావుకోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో జువ్వాడి రత్నాకర్ రావు 5వ వర్ధంతి వేడుకలను కోరుట్ల పట్టణ వెటర్నరీ కళాశాల వద్ద గల మాజీ మంత్రి దివంగత నేత జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహం వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు జువ్వాడి శేఖర్ రావు లు రత్నాకర్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రతి ఏటా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు రత్నాకర్ రావు జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఇందులో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు శేఖర్ రావు లతో కలిసి ప్రారంభించారు అనంతరం జువ్వాడి బ్రదర్స్ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప మహానుభావులు రత్నాకర్ రావు అని స్వర్గీయ రత్నాకర్ రావు అనుక్షణం పేద ప్రజల కోసం పరితపించేవారని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సింది ఉందని తాము తమ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రత్నాకర్ రావు ఆశయ సాధన కోసం నిరంతరం పాటుపడుతూ నియోజకవర్గంలోని ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటామన్నారు ఈకార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు జువ్వాడి శేఖర్ రావు కొమిరెడ్డి విజయ్ ఆజాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ కోరుట్ల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు జువ్వాడి అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


