వేద పండితులు ఫనీంద్ర శర్మ

మోగనున్న పెళ్లి బాజాలు.. పెళ్లికి మంచి ముహూర్తాలు ఇవే..
రణం న్యూస్ డెస్క్ :జులై 21,
మోగనున్న పెళ్లి బాజాలు మొగుతాయని..పెళ్లికి మంచి ముహూర్తాలు ఉన్నాయని అని వేదపండితులు జగిత్యాల జిల్లా కోరుట్ల సంకల్ప విగ్నేశ్వరాలయ అర్చకులు దేశముఖ్ ఫనీంద్ర శర్మ అన్నారు.
ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. జులై నెలలో 26, 30, 31, ఆగస్టు నెలలో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, సెప్టెంబర్ 24, 26, 27, 28, అక్టోబర్ నెలలో 1 ,2 ,3 ,4 ,8, 10, 11, 12, 22, 24, 29, 30, 31, నవంబర్ నెలలో 1 ,2 ,7 ,8, 12, 13, 15, 22, 23, 26, 27, 29, 30 తేదీల్లో పెళ్లికి ముహూర్తాలున్నాయని వేద పండితులు చెబుతున్నారు. భాద్రపద మాసం ఆగస్టు నెలలో21- సెప్టెంబర్ నెలలో21 వరకు ముహూర్తాలు లేవని ఆయన తెలిపారు
