కరపత్రాన్ని ఆవిష్కరించిన ఏఐఎస్ పిఎఫ్ నాయకులు
రణం న్యూస్ కోరుట్ల, జూన్ 19:
2004 పాత పెన్షన్ పథకం స్థానంలో కొత్త పెన్షన్ పద్ధతి ప్రవేశపెట్టి పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే పెన్షన్ కు ఎసరు పెట్టే ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్ లో గల విశ్రాంతి ఉద్యోగుల పెన్షనర్స్ భవన్లో ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ సంఘ నాయకులు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మార్చి 25న గుట్టు చప్పుడు కాకుండా లోక్సభలో బిల్లుకు రూపకల్పన చేసిందన్నారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు చాలా నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు పరచాలని ఈనెల 23న దేశవ్యాప్తంగా ఒకే రోజు అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా దేశ ప్రధానమంత్రి కి లేఖలు పంపనున్నట్లు తెలిపారు. సమస్యను పరిష్కరించేంతవరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎల్లా గంగా రాజo, వనమాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రవీందర్, రాష్ట్ర సభ్యులు అశోక్ రావు, కోరుట్ల పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉయ్యాల నరసయ్య, ప్రధాన కార్యదర్శి ప్రకాష్, కోశాధికారి రుద్ర సుధాకర్, కార్యదర్శి వన తడుపుల మురళి, తులసి రాఘవులు, అధ్యక్షులు రవిశంకర్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు, మేడి కిషన్, రుద్ర మాణిక్యం, గంగారావు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.