

జగిత్యాల ఎస్ఇ బొంకూరి సుదర్శనం
రణం న్యూస్ మేడిపల్లి, జూలై 30: రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు11కేవి నూతన బ్రేకర్లు ప్రారంభించినట్లు జగిత్యాల జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ బొంకూరి సుదర్శనం తెలిపారు. బుధవారం జిల్లాలోని మన్నెగూడెం సెక్షన్ పరిధిలో వెంకట్రావుపేట, ఒడ్యాడ్ సబ్ స్టేషన్లలో రూ.15 లక్షల విలువైన రెండు నూతన అదనపు 11కేవీ బ్రేకర్లను ఎస్ఇ ప్రారంభించారు. నిరంతర విద్యుత్ సరఫరా, అభివృద్ధి పనులలో భాగంగా గత కొంత కాలంగా ఒకే బ్రేకర్ పై రెండు 11కేవి ఫీడర్లు ఉండడం వల్ల విద్యుత్ అంతరాయం ఎక్కువ ఉండేది ప్రస్తుతం ఆ సమస్యని ఒక ఫీడర్ కి ఒక బ్రేకర్ ప్రతిపాదించి రెండు నూతన బ్రేకర్లు ఛార్జ్ చేసి విద్యుత్ అంతరాయం సమస్యను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేసిన అధికారులకు రెండు గ్రామాల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం రెండు సబ్ స్టేషన్లలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పలు పండ్లు, పూల మొక్కలు నాటి బీమారంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో డిఈ లు గంగారాం , మధుసూదన్ , గోపి కృష్ణ , ఏడిఈ లు రఘుపతి , రాజు , ఏఈ అశోక్ , సబ్ ఇంజనీర్ ఎక్కల్ దేవి హరిప్రసాద్, గుత్తెదారు మనోజ్, మన్నెగూడెం విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.