రేషన్ కార్డుతో పేద కుటుంబాలకు 10 లక్షల కవరేజి తో ఆరోగ్య శ్రీ లబ్ది..
ప్రభుత్వ విప్ వేములవాడ , ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్..
రణం న్యూస్, ఉమ్మడి మేడిపల్లి మండలం, జులై 30:
నిరంతర ప్రక్రియగా నూతన రేషన్ కార్డుల జారీ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం రోజున జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి మేడిపల్లి మండల కేంద్రం పి పిఎన్ఆర్ గార్డెన్ ,భీమారం మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయంలో లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని,
పేద ప్రజలు జీవనం కొనసాగించాలంటే రేషన్ కార్డు చాలా ముఖ్యమైనదని ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగ పడుతుందని తెలిపారు. రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకుంటే వెంటనే పరిశీలించి రేషన్ కార్డు మంజూరు చేస్తామని అన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేస్తున్నామని అన్నారు. నూతన రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి, సివిల్ సప్లై అధికారి జితేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, మేడిపల్లి మండల తాసిల్దార్ మునీందర్, భీమారం మండలం తాసిల్దార్ రవి కిరణ్, ఆర్ ఐ లు మాజీ ప్రజా ప్రతినిధులు, రేషన్ కార్డు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

