జిల్లా మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి

రణం: న్యూస్ జగిత్యాల: ఫిబ్రవరి17
జగిత్యాల జిల్లాలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ను మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారం నిబంధనలు పాటించాలని, రిజిస్ట్రేషన్ నమోదు చేయించుకున్నప్పుడు ఇచ్చిన వైద్యుల మరియు సహాయ సిబ్బంది యొక్క పేర్లు మాత్రమే ఉండాలని ఎవరైనా సిబ్బంది వెళ్ళిపోయినా కొత్తవారు వచ్చిన మళ్లీ నమోదు చేయించుకున్న తర్వాతే వారి సేవలు తీసుకోవాలని సూచించారు. హాస్పిటల్స్ లో అందిస్తున్న సేవలకు టారిఫ్ బోర్డ్స్ ను తెలిపే విధంగా హాల్లో ప్రదర్శించవలెనని సూచించారు. అర్హత లేని వైద్యులను నియమించుకోరాదని తెలంగాణ మెడికల్ బోర్డు కౌన్సిల్లో తప్పనిసరిగా నమోదయి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విద్యా బోధకులు కటు కం భూమేశ్వర్, తరాల శంకర్ ఆరోగ్య విస్తీర్ణ అధికారి రాజేశం ,హెల్త్ సూపర్వైజర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు