కల్లూరు గ్రామ ప్రెస్టీజ్ పార్క్ పై నేడు విచారణ
అక్రమ లే ఔట్ లతో అమ్మకాలు చేస్తున్నారు…
కోర్టు నే పక్కదారి పట్టిస్తున్నారని అజీమోద్దీన్ ఆరోపణ..
అక్రమ రిజిస్ట్రేషన్ లు ఆపాలని కలెక్టర్ కు వేడుకోలు
రణం న్యూస్ కోరుట్ల:సెప్టెంబర్11

ఈ వెంచర్ పై పలు ఆరోపణలు…నీటి వనరులు కబ్జా చేశారని… లే ఔట్ కు అనుమతులు లేవని… నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని…అధికారులు వీరితో కుమ్మక్కు అయ్యారని కుమ్మక్కు అయ్యారని… తాజాగా అజీమోద్దీన్ అనే వ్యక్తి తను కొనుగోలు చేసిన భూమిని ఇతరులతో సర్వే నెంబర్472 మార్పు చేసి కొత్తగా472/ఊ/1 సర్వే నెంబర్ సృష్టించి అమ్మకాలు చేస్తున్నారని, కోర్టులో కేసు ఉండగా అక్రమ లే ఔట్ లో వేసి అమ్మకాలు చేస్తున్నారని, కలెక్టర్ పిర్యాదు చేశాడు బాధితుడు.జిల్లా పాలలనాధికారి వెంటనే ఈ విచారణకు ఆదేశించారు… నేడు మండలాదాకారి ఆధ్వర్యంలో బాధితులను, ప్రతివాదులను గ్రామ అధికారిని ఈ విచారణకు జిల్లా పంచాయతీ రాజ్ అధికారి సమక్షంలో విచారణ జరగనుంది.

