మిగితా ఇరవై మంది ని తప్పించారా….?
. పేకాటలో ప్రభుత్వ ఉద్యోగులు…ప్రముఖులు….ప్రజాప్రతిదులు..
కథలాపూర్ మండలం తక్కళ్లపల్లిలో ఆదివారం పేకాట స్థావరాలపై దాడి…
అసలు పేకాట రాయుళ్లను వదిలేశారంటూ ఆరోపణలు…
ఉన్నతాధికారికి తెల్వకుండానే డిపార్ట్మెంట్ లోని కొందరు కిందిస్థాయి శాకాధికారులు…
రణం న్యూస్ కోరుట్ల డివిజన్: నవంబర్ 19,
జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం తక్కళ్ళ పల్లి గ్రామ పరిధిలో గల మామిడి తోటలో పేకాట స్థావరాలపై సీసీఎస్ పోలీస్ లు ఈ నెల 16 వతేది ఆదివారం సాయంత్రం నాలుగు ఐదు గంటల సమయంలో దాడి చేసి నలుగురు పేకాట రాయుళ్లను కోరుట్ల సర్కిల్ పరిధి లోని కథలపూర్ పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పారు.. అప్పటి వరకు బాగానే ఉంది. అసలు కథ ఇక్కడే మొదలయింది. ఆదివారం కథలపూర్ మండలం తక్కళ్ళపల్లి గ్రామంలో మామిడి తోటలో పేకాదుతున్న సమాచారం తెలుసుకున్న సీసీఎస్ పోలీసులు నలుగురు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకొని పదివేల ఐదువందల రూపాయలు స్వాధీనం చేసుకుని కథలపూర్ ఎస్ ఐ కి అప్పజెప్పారు.అయితే పేకాట ఆడుతున్నవారిని కాకుండా పేకాటకు సెంట్రీ లుగా వ్యవహరిస్తున్న నలుగురిని పట్టుకుని సుమారు 20మంది కి పైగా పేకాటరాయుళ్లను, వారి వద్ద ఉన్న డబ్బులను తీసుకుని డమ్మీ ఆటగాళ్ల పేర్లు కేసులో నమోదు చేయించారన్న వార్తలు గుప్పుమన్నాయి.ఈ ఇరవై మందిలో ప్రజాప్రతినిధులు,ప్రభుత్వ ఉద్యోగులు ఇసుక మాఫియా వారు కూడా ఉన్నట్లు సమాచారం.వీరిని పట్టుకోవడానికి వచ్చిన క్రైమ్ శాఖకు చెందిన కానిస్టేబుల్ లు తమ పై అధికారులకు తెల్పకుండానే వచ్చారని కొందరు చెప్పుకొస్తున్నారు.ఇలా కానిస్టేబుల్ స్థాయి వారు దాడిలో పాల్గొనగా పరపతి గల పేకాడుతున్న ప్రజాప్రతినిదులు అధికారులతో సత్సంబదాలున్న మధ్యవర్తులు పై అధికారితో మాట్లాడి ఈ సెటిల్ చేశారని,అసలు ఆటగాళ్లని కాకుండా నిర్వాహకులకు అంగరక్షకులుగా సెంట్రీలుగా ఉండే తమ నలుగురు మనుషులనే ఆటగాళ్లుగా చిత్రీకరించారని వాదన .ఈ మూడు ముక్కలాట గుంపు పై దాడి లో బారిమొత్తంలో నగదుకుడా చేతులు మారినట్లు ఆ నోటా ఈ నోటా రణం ప్రతినిధి చేరింది. వివరాలు సేకరించే ప్రయత్నం చేయగా విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి.
జోరుగా..మందు…విందులతో పేకాట….
కొన్ని నెలల క్రితం వరకు ప్రక్క రాష్ట్రం మహారాష్ట్ర బార్డర్ కి తీసుకెళ్లేందుకు వాహనాలు పెట్టేవారు కానీ ఈమధ్యకాలంలో ప్రక్కనున్న మల్లాపూర్ ,ఇబ్రహీంపట్నం,మెట్ పల్లి లి కాకుండా ఇతర జిల్లాల నుండి పేకాట రాయుళ్లను తీసుకొస్తున్నారు దర్జాగా పేకాడిస్తున్నారు.ఒక్క ఆటగాడి ని తీసుకువస్తే రెండువేల కార్ కిరాయి ఇస్తూ,కోరుకున్న మందు భోజనం వసతి కూడా ఏర్పాటు లు చేస్తున్నారు.వీరి వద్ద పని చేసే ఒక్కో పనివాడికి రోజుకు రెండువేల రూపాయలు మందు విందు పదుల సంఖ్యలో ఉండే వీరికి ఇస్తున్నారంటే నిర్వాహకుల రోజు వారీ సంపాదన ఎంతో చెప్పనవసరంలేదు. అధికారులకు మామూళ్ల రూపంలోనే నెలకు మూడు నుండి నాలుగు లక్షల ముట్టజెప్పుతూ ఈ పత్తాలట నిర్వహిస్తున్నారని నిర్వాహకులు బహిర్గతంగానే చెప్పుకొస్తున్నారు.

ఇసుక మాఫియా టూ పేకాట:-
ఇసుక మాఫియా నిర్వహించే వారే పేకాట నిర్వహకులుగా అవతారం ఎత్తరాని,ఇసుక మొరం దందాలతో అధికారులకు దగ్గరైనవారు కోరుట్ల సర్కిల్ పరిధిలో మేడిపల్లి ,కథలపూర్,కోరుట్ల మండలాల్లోని మామిడితోటల్లో పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారని పలువురుతెలుపుతున్నారు.పొద్దంతా పేకాట,రాత్రిపూట ఇసుక మొరం దందాలతో ఒకరింగ్ గా తయారై అడ్డొస్తే దాడులకు వెనుకాడడం లేదు.

కంచె చేను మేసినట్లు…. ఉన్నతాధికారి కి తెలియకుండానే మామూళ్ల పర్వం….
కొన్నేళ్లుగా పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్న తరచూ స్థలాలు మార్చుతూ పేకాట నిర్వహణపై ఎవరైనా పోలీసులకు సమాచారం అందిస్తే కొందరు పోలీసులు వెంటనే నిర్వాహకులకు తెలిపి తప్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.పేకాట కేంద్రాన్ని కొనసాగిస్తున్నవారు నిర్వహిస్తున్నవారు ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా ఆటను మాత్రం వీడటం లేదు. పేకాటలో పట్టుబడితే..అధికారులకు మామూళ్లు ముడితే చాలని, మేమేం చేశాం మర్డర్ లు చేశామా… మాన భంగాలు చేశామా…. మా వృత్తే పేకాట అని ఆటగాళ్లు విర్రవీగుతారు. జిల్లా స్థాయి ఉన్నతాదికారికి తెలువకుండా కింది స్థాయి కొన్ని శాఖల అధికారులు ఈ ముక్కలాట తతంగం కు వత్తాసు పలుకుతూ దండిగా మాముళ్ళతో సరిపెట్టుకుంటున్నారని తెలియవస్తుంది. ఈ అధికారుల తీరు చూస్తే కంచె చేను మేసినట్లు అనే సామెత నిజమేననిపిస్తుంది. ఈ శాఖలో పోలీస్ ఉన్నతాధికారే ప్రత్యేక దృష్టి సారించి పేకాట కేంద్రా ల నియంత్రణకు స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు మహిళలు కోరుతున్నారు.

