11వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ దాసరి సునిత రాజ శేకర్
రణం న్యూస్ కోరుట్ల: జులై 4
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణం లోని ప్రభుత్వ దవాకాణలో 11వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ దాసరి సునీత రాజశేఖర్ లు అన్నదానం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపార్టీ అని,ప్రతి పథకం పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలుస్తుందని ఆయన అన్నారు.ప్రజా సంక్షేమ పథకాలు నియోజక వర్గం కు తేవడంలో మా నాయకుడు కృషి చేస్తున్నాడని ఆయన అన్నారు.అలాంటి ప్రజానేత జన్మదినం సందర్బంగా పట్టణం లో ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరెండేంట్ డాక్టర్ సునీత రాణి, డాక్టర్ వినోద్ కుమార్,నాయకులు వీరబత్తిని దశరథం, కొంతం నవీన్, బింగి రాజు, కటుకం దివాకర్, చిట్యాల సందీప్ తదితరులు పాల్గొన్నారు
