కబ్జాకోరుల నుండి నా భూమిని ఇప్పించండి .
జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన బాధితుడు చాంద్ పాషా @షఫిక్
రణం న్యూస్ కోరుట్ల: మార్చి 12
ప్రస్తుతం భూముల ధరలు అమాంతం పెరుగుతుండటంతో కబ్జాకోరుల కదలికలు కూడా పెరుగుతున్నాయి. పట్టణాలకు సమీపంలో ఉన్న ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములపై అక్రమంగా కన్నేసే ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొంతమంది నకిలీ పత్రాలు తయారు చేసి భూములను తమ పేర్లపై చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు మధ్యవర్తులు, దళారులు ఈ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. భూముల విలువ పెరగడం వల్ల త్వరగా లాభాలు పొందాలనే ఉద్దేశంతో కబ్జాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఈ పరిస్థితి వల్ల అసలు యజమానులు మరియు సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూములపై వివాదాలు కూడా పెరుగుతున్నాయి. అధికారులు సమయానికి స్పందించకపోతే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. భూకబ్జాలను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ కబ్జాలపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు.

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన చాంద్ పాషా అబ్దుల్ షఫీక్ తనకు చెందిన 504 చదరపు గజాల భూమిని తిప్పిరి గంగాధర్, అజర్ భాయ్, సుజాహిత్ అలీ, ఎండీ రషీద్, ఖలీద్, ఇర్ఫాన్, ఎండీ మతిన్, డాన్ షకీల్ , అబ్దుల్ ఘని అనే వ్యక్తులు అక్రమంగా కబ్జా చేశారని చాంద్ పాషా అబ్దుల్ షఫీక్ ఆరోపించారు.పై వ్యక్తులు నేరచరిత గల వారని వారి నుండి నాకు ప్రాణహాని ఉందనితెలిపారు.పట్టణంలోని కృష్ణ మందిరం ముందు నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న తమ భూమిలో వారం రోజుల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించి గుంతలు తవ్వారని ఆయన పేర్కొన్నారు. 293 సర్వే నంబర్లో ఉన్న తన స్థలానికి సంబంధించిన తప్పుడు ధ్రువపత్రాలు తిప్పిరి గంగాధర్ సృష్టించుకున్నారని ఆరోపించారు. కొందరు వ్యక్తులు దళం నాయకుల వాళ్ళమని మరికొందరు “భాయ్ గ్యాంగ్” డాన్ గ్యాంగ్ పేర్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు.
తన భూమిని తిరిగి ఇప్పించి, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఆర్డీఓ కు మున్సిపల్ కమిషనర్ కు పిర్యాదు చేసినట్లు చాంద్ పాషా తెలిపారు.

