హెచ్చరిస్తున్న కరంట్ పోల్…

ప్రాణాపాయం జరిగితేనే పట్టించుకుంటారా…?
నిద్రావస్థలో విద్యుత్ అధికారులు..?
రణం న్యూస్ కోరుట్ల: జులై 7,
అసలే వర్షాకాలం.. రోడ్లన్నీ బురదమయం… చినుకు పడితే చిత్తడిగా మారే రవాణా వ్యవస్థ..ఇదిలా ఉంచితే విద్యుత్ శాఖ అధికారులు నిద్రిస్తున్నారా అంటే నిజమే అని చెప్పాలి…మెయిన్ రోడ్ ఒక విద్యుత్ పోల్ వంగిపోయి విన్యాసం చేసున్నట్లు కనిపిస్తూ ప్రమాదకరంగా ఉన్న పట్టించుకునే వారే లేరు. ఆ కాలని వాసులు పలుసార్లు విన్నవించుకున్న అటువైపు చూసే అధికారే కరువయ్యాడు.
వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జాతీయ రహదారిని ఆనుకుని స్మశాన వాటికకు వెళ్లే దారి సాయిరాంపురా కాలనీలో కరంట్ స్థంభం వంగిపోయి ప్రమాదకరంగా మారింది.ఈ వంగి ఉన్న స్థంబానికి సపోర్టింగ్ ఇంకో స్థంబాన్నీ అమర్చారు.ఈ పోల్ హై టెన్షన్ వైర్లు , ఆ కాలనీ వాసులకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఇదే స్థంబానికి ప్రైవేట్ వ్యక్తుల సంస్థల కేబుల్,నెట్ ఇతరత్రా తీగలు కుప్పలు కుప్పలుగా తగిలేసి ఉండటం ఏ తీగ తెగినా ఆ దారిగుండా వెళ్లే కాలనీ వాసులు, దహన సంస్కారాలకు వెళ్లే జనాలు జగుసుకుంటున్నారు.ఈ విదంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్న కరంట్ పోల్ లను తొలగించి వీటి స్థానంలో కొత్త ఫాల్ వేయకపోవడం,గజి బిజీ గా ఉన్న ఇతర వ్యవస్థ ల తీగలను పోల్ కు వేలాడదీసిన చూసి చూడనట్లుగా వ్యవహరించడం లో విద్యుత్ అధికారుల అలసత్వమా లేక అమ్యామ్యా లకు నిదర్శనమా అర్థం కావట్లేదని కాలనీ వాసులు విమర్శిస్తున్నారు. అదేవిదంగా పోల్ లకు వేలాడదీసిన తీగల పోల్ చార్జీలు తీసుకుంటున్నారా అందిన కాడికి వెనకేసుకుంటన్నారా అనే అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మాకు ముట్టేవి మాకు ముడుతే చాలు ఏది ఎవరు ఏమైతే మాకెందుకులే అనే నిర్లక్షమో తెలియదుకాని వార్డు ప్రజలకు, జీవితం లో ఆఖరిగట్టం స్మశాన దహన సంస్కారాలకి జరిపే ఆ దారి గుండా వెళ్లకుండా అడ్డుగ ఉన్న పోల్ ను సరిచేస్తారో ప్రమాదం జరిగి ప్రాణాల మీదకు వస్తేనే స్పందిస్తారో వేచి చూద్దాం.

బడా బడా బవంతుల ముందు ట్రాన్స్ఫార్మర్ల గంటల్లోనే అమరిక
బడా బడా బవంతుల ముందు లేని అనుమతులు చూపెడ్తూ అప్పటికప్పుడే ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తారు కానీ దారిన పోయేవారిపై ఎపుడు కూలిపోతుందో తెలియని ఇలాంటి స్థంబాలని మాత్రం సరిచేయరు. బడా బాబులు ఇచ్చే మామూళ్ల పైన మక్కువనే కావచ్చు అని కాలనీ వాసులు కరంటోళ్ల పై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారుల తీరుపైన వార్డు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా పట్టణంలో ప్రతి ఏరియాలో వంగిన స్తంభాలు, గజిబిజిగా విద్యుత్ స్తంభాలకు వేలాడదీసిన తీగలు మనకు కనిపిస్తాయి. ఈ మధ్య కాలం లోనే పట్టణం లో విద్యుత్ ప్రమాదం జరిగి ఇద్దరి ప్రాణాలు కోల్పోయి పలువురు తీవ్రగాయాల పాలయ్యారు అలా ఏదైనా ప్రాణ హాని జరిగేదాక సరిచేయరా నిద్రవస్థ వీడి పోల్ సరిచేస్తారో వేచి చూద్దాం.
