పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల అధ్యక్షులు కొంతం రాజం
రణం న్యూస్ కోరుట్ల, సెప్టెంబర్ 3: అభివృద్ధి పేరుతో అవినీతి, అక్రమాలకు తెరతీసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోచుకొని దాచుకొని
కల్వకుంట చేసింది కల్వకుంట్ల కుటుంబమేనని కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల అధ్యక్షులు కొంతం రాజం ద్వజమెత్తారు.
కోరుట్ల పట్టణంలో బుధవారం పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల అధ్యక్షులు కొంతం రాజం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల ధనాన్ని దోచుకున్నది కల్వకుంట్ల కుటుంబమేనని అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందే కాకుండా దొంగ తనం చేసిన నేరస్టుడే దొంగ దొంగ అని అరిచినట్టుగా టిఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతి బయటకు వస్తే స్థానిక ఎమ్మెల్యే తండ్రి మాజీ ఎమ్మెల్యే 100 కోట్ల మేర కాలేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్ట్ బినామీలకి ఇచ్చి అవినీతికి పాల్పడిన విషయం బయటకు వస్తుందని, ధర్నాలకు పాల్పడుతున్నారని అన్నారు. కాలేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని,మీ నాయకుడు కేసీఆర్ బిడ్డ కవిత చెప్పిన విషయం మర్చిపోయి ,కోరుట్ల లో ధర్నా చేయడం విడ్డూరం అని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేనప్పుడు సిబిఐ విచారణ ఆదేశిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు…ఈ కార్యక్రమంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంతం రాజం,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాళ్ళ సత్యనారాయణ,కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మ్యకల నర్సయ్య,కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి,కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రాల హరీష్,వెంకటేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్ చికివేరి విజయ్,కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ మాజీ ఉప అధ్యక్షుడు సైదు గంగాధర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధవేణి రవి,తదితరులు పాల్గొన్నారు.

