లక్షల రూపాయల ఆస్తినష్టం
రణం న్యూస్, మేడిపల్లి మండలం, మే 23:
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన గోపు శోభ కు చెందిన పశువుల కొట్టం గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో కాలిపోయింది. ఇట్టి పశువుల కొట్టంలో వ్యవసాయానికి సంబంధించిన డ్రిప్ పైపులు, పీవీ సి పైపులు, వ్యవసాయ పనిముట్లు, ఇతర ఇతర సామాగ్రి ఉందని ఇట్టి సామాగ్రి విలువ సుమారు 350000/మూడున్నర లక్షల వరకు బాధితురాలు తెలిపారు. పశువుల కొట్టాన్ని స్థానిక తహసీల్దార్ పరిశీలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు సబ్ ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

