రణం న్యూస్ కోరుట్ల, జూలై 5: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేశ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారాహి మాత కు శుక్రవారం రాత్రి అమ్మవారి సన్నిధిలో లక్ష్మీ గణపతి,చండీ, వారాహి రుద్ర హోమం నిర్వహించారు. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో 9 రోజుల పాటు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ అని ఈ సమయంలో వారాహి దేవిని పూజించడం ద్వారా భక్తులు శత్రువుల నుండి రక్షణ పొందుతారని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
ఈ నవరాత్రులు జూన్ 26 నుండి జూలై 4 వరకు నవరాత్రులు నిర్వహిస్తామని జూలై 5 నాడు వారాహి మాత నిమజ్జనం జరుగుతుంది. వారాహి నవరాత్రుల ప్రత్యేకత ఏంటంటే శత్రువుల నుండి రక్షణ వారాహి దేవిని పూజించడం ద్వారా శత్రువుల నుండి దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుందని భక్తులు నమ్ముతారు. వారాహి దేవి అనుగ్రహంతో భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులలో భాగంగా జరుపుకుంటారని తెలిపారు.
గణేశ నవదుర్గ మండలి అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి వారాహి దేవి నవరాత్రులు జరుపుతున్నామని, కానీ ఈ సంవత్సరం నుండి ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహం పెట్టి వారాహి పూజలు జరుగుతున్నాయని వారు తెలిపారు. వారాహి మాత నవరాత్రులు జరుపుకోవడం కోరుట్ల పట్టణంలో ఇదే మొదటిసారి అని ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారని వారు పేర్కొన్నారు. దసరా నవరాత్రులకు, వారాహి నవరాత్రులకు తేడా ఉంటుందని వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారని, ఈ మాతకు రాత్రి వేళ పూజిస్తారని, వారాహి మాతకు రాత్రి వేళలో ధూపం, దీపం, నైవేద్యం అభిషేకం హోమం ఉంటాయని, సూర్యాస్త సమయములో పూజ కార్యక్రమాలు జరుపుకుంటారని వారు తెలిపారు. అలాగే జులై 5న అమ్మవారిని ప్రజల, భక్తుల సమక్షంలో నిమజ్జనం చేయబడునని ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
ఈ కార్యక్రమంలో గణేశ నవదుర్గ మండలి గౌరవ అధ్యక్షులు కట్ట నారాయణ, అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి అడువాల ప్రభాకర్ కార్యవర్గ సభ్యులు గాజుల రమేష్, లక్కంపల్లి విజయ్, నవీన్ మండలి సభ్యులు సంకు అశోక్, కటుకం గంగారాం, చింతకింది సత్యనారాయణ, కార్తీక్, ప్రవీణ్, రాము, కళ్యాణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

