రణం న్యూస్ కోరుట్ల, జూలై 1: కోరుట్ల పట్టణంలో గణేశ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి ఆలయంలో ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా మహిళలు బోనాల తో ఊరేగించి అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పించా రు. అమ్మవారి సన్నిధిలో ప్రతి రోజు భక్తులు తరలివచ్చి తమ కోర్కెలు తీర్చాలని మొక్కలు చెల్లించుకుంటున్నారు. భక్తుల కోరికలు తీర్చిన అమ్మవారికి భక్తితో నైవేద్యంగా బోనం సమర్పించుకుంటున్నారు.
పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలు సుఖశాంతు లతో ఉండాలని అందరి పట్ల అమ్మవారి దయ చూపాలని భక్తులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గణేశ నవదుర్గ మండలి గౌరవ అధ్యక్షులు కట్ట నారాయణ,అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జెల శంకర్, కోశాధికారి అడువాల ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు గాజుల రమేష్, లక్కంపల్లి విజయ్, నవీన్, కార్యకర్తలు కటుకం గంగారాం, చింతకింది సత్యనారాయణ, కార్తీక్, ప్రవీణ్, రాము, కళ్యాణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

