


ముస్లిం మత పెద్దలు ప్రవచనం
జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు
ఈద్గా మైదానాలు,మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
రణం న్యూస్ జగిత్యాల, జూన్ 07,
మానవ జన్మ ఎత్తిన వారు ప్రతి ఒక్కరు తమకు లభించిన దాంట్లో ఇతరులకు ఎంతో కొంత త్యాగం చేయడంతో జన్మకు సార్ధకత లభిస్తుందని ముస్లిం మత పెద్దలు ప్రవచన మిచ్చారు.. ముస్లిం సోదరులు పండుగల్లో విశిష్టమైన బక్రీద్ పండుగ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది.. జిల్లాలోని అన్ని ఈద్గా మైదానాలు, మసీదులలో శనివారం ఉదయం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ బక్రీద్ త్యాగం యొక్క విశిష్టతను తెలియజేస్తుందని ప్రతి ఒక్కరు స్వార్థం తగ్గించుకొని ఇతరులకు సహాయ పడేలా ఉండాలని పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ విశిష్టత గురించి తెలియజేశారు. జిల్లా లోని జగిత్యాల , కోరుట్ల, ధర్మపురి పట్టణాలతో పాటు అన్ని మండలాల్లో ఈద్గా మైదానాల్లో బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ ప్రవక్త ఇబ్రహీం (అ.స) కు ఇద్దరు భార్యలు బిబిసారా, బీబీ హాజిరా వీరికి చాలా కాలం వరకు సంతానం లేదని లేక పుట్టిన కొడుకును ఇస్మాయిల్ (అ.స) అని పేరు పెట్టారు.ఇస్మాయిల్ (అ.స) అన్ని పనుల్లో తండ్రిగా చీరలు వాడుగా ఉండేవాడు ఇబ్రహీం (అ.స)కు ఒకరోజు స్వప్నంలో తన ఎదిగిన కుమారుడు ఇస్మాయిల్ (అ.స) స్వప్నంలో తన ఎదిగిన కుమారుడు ఇస్మాయిల్ (అ.స)ను తనకు ప్రాణ త్యాగం రూపంలో సమర్పించాలని అల్లాహ్ ఆదేశించారు. ఇదే విషయాన్ని తన కుమారుడికి చెప్పగా అల్లాహ్ కోసం ప్రాణ త్యాగానికైన సిద్ధమని చెప్తాడని కుమారున్ని వెంటబట్టుకొని జన సంచారం లేని అటవీ ప్రాంతం తీసుకెళ్లి కుమారున్ని బోర్లా పడుకోబెట్టి తాను తెచ్చిన
తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి ఇస్మాయిల్ (అ.స) మెడపై కత్తి పెట్టి జుబాహ్ కు ఇబ్రహీం (అ.స) కు సిద్ధపడగా ఆయన త్యాగం త్యాగానికి మెచ్చిన అల్లాహ్ ప్రాణ త్యాగానికి బదులుగా ఓ జీవనాన్ని బలి ఇవ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరుతాడని, అప్పటినుండి బక్రీద్ పండుగ రోజు ఖుర్బానీ గా ఇవ్వడం ముస్లింలకు ఆనవాయితీగా మారిందని.. పండుగ రోజు ఖుర్బానీ గా ఇచ్చే మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి ఒక భాగం పేదలకు, రెండవ భాగం బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగించడం ఆనాయితిగా వస్తుందని.. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ ఇస్తారని మతపెద్దలు వివరించారు.విశేష సంఖ్యలో ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం పరస్పర ఆలింగలతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నమాజ్ అనంతరం వృద్ధులకు, పేదవారికి, చుట్టాలకు, స్నేహితులకు, ఖుర్బానీ ఇచ్చి మాంసం పంచుకున్నారు.
పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ముస్లింలు తమ విందు, వంటకాలను హిందూ సోదరులకు అందించి పరమత సహనం చాటుకున్నారు.. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, యువత, తదితరులు పాల్గొన్నారు.
బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు
ముస్లింల పవిత్ర పండగ బక్రీద్ పురస్కరించుకొని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు శనివారం కోరుట్ల పట్టణంలోని ముస్లిం ప్రముఖుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు .. ఈసందర్భంగా
పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నయీమ్ ఇంట్లో పత్రిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో నివసించే పౌరులందరికీ భారత రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని ప్రజలందరూ కూడా బాధ్యతతో తమ విధులను నిర్వర్తించాలని అన్ని మతాల పట్ల సోదరభావం తో జీవించాలని అన్నారు.. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇటీవల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫోటోలు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో పెట్టాలని అడుక్కుంటున్నారని అసభ్య పదజాలంతో మాట్లాడని దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రుల చిత్రపటాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో విధిగా ఉంచాలని నిబంధన ఉందని ఈ విషయం కల్వకుంట్ల సంజయ్ కి అవగాహన లేకపోవడం దురదృష్టకరమని సంజయ్ కి రాజ్యాంగం మీద కూడా సరైన అవగాహన లేదని ఎమ్మెల్యే విధుల పట్ల కూడా అవగాహన లేదని అన్నారు. ఎమ్మెల్యేగా అన్ని మతాలను సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ఉండి బక్రీద్ సందర్భంగా ఎక్కడ కనిపించక పోవడంపట్ల జువ్వాడి కృష్ణారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో వారి వెంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్,నాయకులు ఎంఏ నాయిం, ఎంబేరి నాగభూషణం, పెరుమాండ్ల సత్యనారాయణ,చిటిమెల్లి రంజిత్ గుప్తా, ఎంబేరి సత్యనారాయణ, ముల్కప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రశాంత వాతావరణంలో బక్రీద్
ఈద్గాలు, మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లాలో ఈద్గాలు, మసీదుల వద్ద బక్రీద్ ప్రార్థనలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రం తో పాటు కోరుట్ల ,మెట్ పల్లి లో గల పలు ఈద్గా ల వద్ద జరుగుతున్న ప్రార్థనలు ఎస్పి గారు స్వయంగా పరిశీలించారు. ఈద్గా, మసీదుల వద్ద ప్రార్థనలకు ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముస్లింల త్యాగనిరతికి, ధర్మ నిబద్ధతకి ప్రతీక బక్రీద్ పండుగ అని అత్యంత భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండగ జరుపుకుంటున్న ముస్లింల కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఎస్పీ వెంట డిఎస్పీలు రఘు చందర్, రాములు, సిఐ లు వేణుగోపాల్, సురేష్, అనిల్ కుమార్, మరియు ఎస్.ఐలు ఉన్నారు