రణం న్యూస్ హైదరాబాద్ :జూన్ 21 తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది శేర్ నర్సారెడ్డి ఎంపికయ్యారనీ, ఈమేరకు నియామక ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ తెలిపారు. హైదరాబాద్ లో ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి రాష్ట్ర, జిల్లా, మండల ప్రతినిధులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈమేరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శేర్ నర్సారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య తెలిపారు. గతంలో జగిత్యాల జిల్లా మున్నూరు కాపు యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా శేర్ నర్సారెడ్డి బాధ్యతలను నిర్వహించి మున్నూరు కాపు సంఘం పటిష్టతకు కృషి చేశారు. ఈసందర్భంగా శేర్ నర్సారెడ్డి మాట్లాడుతూ తన ఎంపికకు సహకరించిన తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాదినేని రాజేందర్, ప్రధాన కార్యదర్శి జల్లేపల్లి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ నగర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఆర్.వి. మహేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాదినేని రాజేందర్ ల ఆధ్వర్యంలో మున్నూరు కాపు సంఘ పటిష్టతకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
