రణం న్యూస్ డెస్క్: మార్చి 24
బ్రతుకుదేవు కోసం ఖతార్ దేశానికి వెళ్లిన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన బొమ్మల మధు(34) అనే కార్మికుడు నెల రొజులుగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడు.కానీ రోజు రోజుకూ ఆరోగ్యం క్షీణించి ఈ నెల 18 న మరణించాడు ఈ విషయాన్ని గల్ఫ్ దేశంలో ఉన్న తెలంగాణ గల్ఫ్ సమితికి కుటుంబ సభ్యులు తెలుపారు, సమాచారం అందుకున్న తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు మృతదేహాన్ని మార్చి 23 న స్వదేశానికి చేర్చడం లో ఛాలా కృషి చేశారు.దేశం కానీ దేశంలో కష్ట కాలంలోవలస కార్మికులకు తోడుంటున్న సమితికి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు


