ప్రసవించిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు అందించాలి…
ఆగస్టు 1 వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు..
కాంగ్రస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు


రణం న్యూస్ కోరుట్ల,: ఆగస్టు 6: తల్లిపాలతో పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రసవించిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు అందించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువాడి కృష్ణారావు అన్నారు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం కోరుట్ల పట్టణ భీముని దుబ్బ అంగన్వాడి సెంటర్లో లో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఇద్దరు పిల్లలకు అన్న ప్రాసన చేయడం జరిగింది అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ పిల్లలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రస్తుతం తల్లిదండ్రులు తమ బిడ్డలకు అత్యుత్తమ సంరక్షణను అందించడంలో అనేక సవాలను ఎదుర్కొంటున్నారని ప్రసవం అలాగే ప్రసవానంతర కాలంలో పిల్లల కోసం కొనసాగుతున్న సంరక్షణ కూడా చాలా ముఖ్యమైనదని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంగన్వాడి సెంటర్లలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం 13 వ వార్డు లో 30 వ వార్ఫులో గల అంగన్వాడి సెంటర్లలో చిన్న పిల్లలకు అన్నప్రాసన చేపట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్,30 వ వార్డ్ ఎంబెరి సత్యనారాయణ, ఐసిడిఎస్ సూపర్ వైజర్ అలవాల భారతి, డాక్టర్ శృతిలయ, ఏఎన్ఎం విజయలక్ష్మి, శిరీష, అంగన్ వాడీ టీచర్లు శీలం హిమగిరి, అన్నం లక్ష్మి, పి పద్మ, రెంజర్ల రాజమణి, సిహెచ్ అరుణ, ఏ ప్రేమలతా, సిహెచ్ పుష్పలత, పి. రమాదేవి, వి. అనసూయ, ఆశ వర్కర్లు, అన్నపూర్ణ, శారద, జ్యోతి,తల్లులు పిల్లలు కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.