రణం న్యూస్, కోరుట్ల(కల్చరల్)
కోరుట్ల మండలంలోని జోగినపల్లిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా సోమవారం స్వామివారి కళ్యాణం మహా అన్న ప్రసాద వితరణ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పన్నాల అంజిరెడ్డి, మండల అధ్యక్షుడు కొంతం రాజు, నెమూరి భూమయ్య, గడ్డం కిరణ్,కోరుట్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమర్ పాల్గొన్నారు.