రణం న్యూస్ కోరుట్ల, జులై 4
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు జన్మదినాన్ని పురస్కరించుకుని సాయిబాబా దేవాలయం లో ఆలయ కమిటీ అభిషేకం నిర్వహించి మొక్కలు నాటి జన్మదిన వేడుకలు నిర్వహించారు. దేవాలయ చైర్మన్ బాల్ నర్సయ్య మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ప్రజాపార్టీ అని,ప్రతి పథకం పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలుస్తుందని ఆయన అన్నారు.ప్రజా సంక్షేమ పథకాలు నియోజక వర్గం కు తేవడంలో మా నాయకుడు కృషి చేస్తున్నాడని ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేశారు.అలాంటి ప్రజానేత జన్మదినం సందర్బంగా సాయిబాబా ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటమని చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు గడ్డం కిరణ్ , అల్లే సదాశిప్, చిలువేరి విద్యాసాగర్ నిమ్మల శ్రీనివాస్,ప్రధాన అర్చకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

