రణం” న్యూస్ కోరుట్ల:మే8 ,కోరుట్ల నియోజకవర్గం లోని పలు అభివృద్ధి పనుల కోసం జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు ఈరోజు జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో సమావేశం అయ్యారు కోరుట్ల పట్టణంలోని సహాయ రవాణా అధికారి (ఆర్టీవో )కార్యాలయానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు దీంతోపాటు కోరుట్ల నియోజకవర్గంలోఇటీవల కురిసిన వర్షం ఈదురుగాలుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు వెంట కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజి సదానంద చారి పాల్గొన్నారు

