
డిఎస్పీ రఘు చందర్ ను కోరిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ
రణం న్యూస్ జగిత్యాల, (ఆగస్టు 30):
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ పెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) యూనియన్ జగిత్యాల జిల్లా సభ్యడు కుర్మ రమేష్ పై ఇటీవల రవాణా శాఖ ఉద్యోగి ఇచ్చిన తప్పుడు, ఉద్దేశ పూర్వక ఎస్సి/ఎస్టీ అట్రాసిటీ కేసు ఫిర్యాదుపై విచారణ జర్పించవలసిందిగా కోరుతూ శనివారం ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో సభ్యులు జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ ను వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా డిఎస్పీ రఘు చందర్ మాట్లాడుతూ జిల్లా ఫెడరేషన్ తరపున ఇచ్చిన వినతి పత్రం మేరకు కేసుపై నిస్పక్షపాత విచారణ జరిపి తగు చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఇమ్రాన్ వెంట టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ద్యావర సంజీవరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మేన్నేని రవీందర్ రావు తోపాటు ఫెడరేషన్ సభ్యులు ఉన్నారు.

