
జగిత్యాల జిల్లా వైద్యాధికారి కె ప్రమోద్ కుమార్
రణం న్యూస్ జగిత్యాల మే9జగిత్యాల జిల్లా సమీకృత అధికారుల సముదాయంలోనీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే ప్రమోద్ కుమార్ ఉపవైద్యాధికారీ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లాలో వైద్యాధికారులకు ,మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కు “టిబి ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమం క్రింద వంద రోజుల కార్యచరణ గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో క్షయ వ్యాధికి గురి అయ్యేటువంటి అవకాశం ఉన్నందు వలన పాపులేషన్ ను గుర్తించి జిల్లాకు పంపించవలసిందిగా ఆదేశించారు. 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు, పొగ త్రాగేవారు, ఆల్కహాల్ త్రాగడం,పొగాకు తినడం, డయాబెటిస్ ఉన్నటువంటి వారిని గుర్తించి వివరాలు అందించాలని తెలిపారు. ఆ తర్వాత 100 రోజులలో వారందరినీ స్క్రీనింగ్ చేసి స్పూటం పరీక్షలు చేయడం, ఎక్సై రే లు తీసి టీబీ వ్యాధి గ్రస్తులను గుర్తించి చికిత్సలు అందిస్తామని తెలిపారు. ఒకవేళ నెగటివ్ వచ్చినట్లయితే టీబి ప్రివెంటివ్ థెరపి ద్వారా చికిత్స అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఏ శ్రీనివాస్ డాక్టర్ జైపాల్ రెడ్డి ,డాక్టర్ అర్చన , వైద్యాధికారులు, డిపిఓ రవీందర్ అసిస్టెంట్ మలేరియా అధికారి సత్యనారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్, తరాల శంకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు