ఇండ్ల ముందు వేలాడుతున్న తీగలు..
పోల్ చార్జీల వసూళ్ల లో జాప్యమా
రణం న్యూస్ కోరుట్ల, మే 9
అసలే ఎండాకాలం గాలి వానలతో విద్యుత్ స్తంభాలు కూలిపోవడం తీగలు తెగిపోవడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. కానీ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం కొత్త బస్టాండ్ సమీపంలో రథాలపంపు ఏరియాలో విద్యుత్ స్తంభాలకు కేబుల్ ,ఇంటర్నెట్ తీగలు కిందకు వ్రేలాడుతూ పాదచారులకు వాహన దారులకు ఇబ్బందిగా మారాయి.ఇంట్లో నుండి బయటకు రాకుండా అడ్డుగా ఈ తీగలు ఉండటం గమనార్హం.కొన్ని రోజులుగా ఈ విదంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్న వీటిని తొలగించడం లో జాప్యం ఎందుకు జరుగుతుందో విద్యుత్ అధికారులకు తెలియాలి.పోల్ చార్జీలు ఇచ్చి పుచ్చుకోవడం లో ఏమైనా అంతరాయం కలిగిందో మాకెందుకులే అనే నిర్లక్షమో తెలియదుకాని వార్డు ప్రజలకు రాకపోకలు జరిపే వారికి ఇంటికి అడ్డుగా ఉన్న ఈ తీగలు తొలగించక పోవడం ఈ సమస్య గురించి ఎవరికి చెప్పాలో తెలియక సతమతమౌవుతున్నారు. కేబుల్ ఆపరేటర్ల పైన మక్కువనా ఇంటర్ నెట్ వారిపైన మక్కువనా లేక వీరివురు ఇచ్చే మామూళ్ల పైన మక్కువనా అని విద్యుత్ అధికారుల తీరుపైన వార్డు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా పట్టణంలో ప్రతి ఏరియాలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తాయి.ఇప్పటికైనా కరంటోళ్లు గజిబిజిగా విద్యుత్ స్తంభాలకు వేలాడదీసిన తీగలు సరిచేస్తారో లేదో వేచి చూద్దాం.


