పూర్తిగా కాలి బూడిద అయిపోయేదాక కానరాని…ఫైర్ ఇంజన్
అగ్నిమాపక శాఖ అధికారుల తీరు...
కొండగట్టు గుట్ట కింద భారీ అగ్ని ప్రమాదం..
రణం న్యూస్ జగిత్యాల,నవంబర్30
ఈ సౌండ్ ఎప్పుడో ఒకసారి వినపడుతోంది.. వీరు ప్రతి విషయంలో వీరికి బాధ్యత ఉంటుంది కానీ ఎక్కడా కనపదారు….చేయాల్సిన పనికుడా వీరికి బారమే..ప్రతి నిర్మాణం లో వీరి ప్రమేయం ఉంటుంది. ప్రతి షాప్ కు వీరి ఎన్ ఓ సి ఉండాలి..స్కూల్, కాలేజి, షాప్, హాస్పిటల్, ఇంటి నిర్మాణం, ఫ్యాక్టరీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యవస్థకు ఈ అగ్నిమాపక శాఖ నుండి అనుమతులు పొందాలి.కానీ వీరు ఎక్కడ కూడా తనికీలు చేసిన దాఖలాలు కనపడవు.కనీసం అగ్ని ప్రమాదాలు జరిగినపుడైన స్పందిస్తారా అది లేదు.. పూర్తిగా తగలపడి పోయాక సంఘటనా స్థలాకి వస్తారు.వీరూ ఉద్యోగం ఉండి విశ్రాంత ఉద్యోగులనే తలపిస్తారు

జగిత్యాల జిల్లా కొండగట్టు లో శనివారం రాత్రి తొమ్మిది పది గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలతో 20కి పైగా షాపులు మంటల్లో పూర్తిగా దగ్ధం అయ్యాయి. కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.అగ్నిమాపక శాఖ వారు సమయానికి వస్తే ఇంత ఆస్తినష్టం జరిగేది కాదు అని మా ఆస్థులు బుగ్గి పాలు అయ్యవి కాదు రోధిస్తున్నారు.


